‘జగన్నాధ రథ చక్రాలు’పై న్యాయపోరాటానికి నిర్ణయం
ABN , First Publish Date - 2020-06-19T18:39:12+05:30 IST
'జగన్నాథ్' అంటే ఆపలేనిది అని అర్థం. కానీ జగన్నాథుడి రథచక్రాలకు ఈసారి బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా 'సుప్రీం' బ్రేకులు వేసింది. భక్తులు మాత్రం జరిపితీరుతామని, అందుకు న్యాయపోరాటం చేస్తొమని స్పష్టం చేశారు. శ్రీక్షేత్రానికి ప్రవేశం లేని విదేశీయులు ఈ యాత్రల్లో పురుషోత్తముడిని బహిరంగంగా చూడగలుగుతారు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.
పూరి : 'జగన్నాథ్' అంటే ఆపలేనిది అని అర్థం. కానీ జగన్నాథుడి రథచక్రాలకు ఈసారి బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా 'సుప్రీం' బ్రేకులు వేసింది. భక్తులు మాత్రం జరిపితీరుతామని, అందుకు న్యాయపోరాటం చేస్తొమని స్పష్టం చేశారు. శ్రీక్షేత్రానికి ప్రవేశం లేని విదేశీయులు ఈ యాత్రల్లో పురుషోత్తముడిని బహిరంగంగా చూడగలుగుతారు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.
అయితే... లక్షలాది మంది భక్తుల ఆధ్వర్యంలో వైభవంగా ఈనెల 23 న జరగాల్సి ఉన్న జగన్నాథుడి రథయాత్ర త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. ఈ ఏడాది మే 14 న 'ఆదాబ్' 'జగన్నాథ రథచక్రాలు కదలాల్సి ఉంది. అయితే... అసలేం జరిగిందంటే... సుమారు 10-12 రోజులపాటు సాగే పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రతీ ఏటా దేశ, విదేశాల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారు. కరోనా నేపధ్యంలో ఈ ఏడాది జగన్నాథుడి రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ ఒడిశాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
దీనిపై ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బొబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, దినీష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
'జగన్నాథ్' అంటే... ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బొబ్డే మాట్లాడుతూ.. కరోనా సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి తమను క్షమించడని వ్యాఖ్యానించారు.
అసలు ‘జగన్నాథ్’ అంటే... జగన్నాథ్ అంటే ‘ఆపలేనిది’ అని అర్థం అని అన్నారు. ఎన్నడూ ఆగని జగన్నాథుడి రథచక్రాలను కరోనా వల్ల ఆపాల్సి వస్తోందని చెప్పారు.
కలగా మారిన కాసుల పంట... జ్యేష్ఠ పౌర్ణమి(దేవస్నానయాత్ర) నుంచి ఆషాఢ పౌర్ణమి(నీలాద్రి బిజె) వరకు పూరీ లక్షలాదిమంది భక్తులతో కళకళలాడుతుంది. ఈ నెల రోజుల్లో ఏర్పాటయ్యే దేవస్నానం, నవయవ్వన దర్శనం, రథయాత్ర, హీరాపంచమి, సంధ్యా దర్శనం, బహుడా (తిరుగు)యాత్ర, సున్నాభెషొ, అధరపొణా, నీలాద్రి బిజె వేడుకలు ప్రత్యేకమైనవి కావడంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు, సందర్శకులు పూరీ చేరుకుంటారు. శ్రీక్షేత్రానికి ప్రవేశం లేని విదేశీయులు ఈ యాత్రల్లో పురుషోత్తముడిని చూడగలుగుతారు. అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. రథయాత్ర ఉత్సవాల నేపథ్యంలో వ్యాపారులకు కాసుల పంట పండేది.
కరోనాతో కటకట... మార్చి 22 నుంచి కరోనా విజృంభణతో శ్రీక్షేత్రాన్ని మూసేశారు. స్వామి సేవలు మినహా భక్తుల దర్శనాలను నిషేధించారు. పూరీకి రాకపోకలు లేవు. ఆంక్షల మధ్య రథాల తయారీ పనులు జరుగుతున్నాయి. రథయాత్రపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించలేదు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
స్టే ఇచ్చింది... ఈ రథయాత్రపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఒకవేళ వేడుకలు ఏర్పాటైనా భక్తులుండరు. కేవలం సేవాయత్ లు, పోలీసు బలగాలు మాత్రం రథాలు లాగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులు ఉసూరుమంటున్నారు.
గతేడాది 'ఫొని'... ఈ ఏడాది 'కరోనా'... కిందటి సంవత్సరం మే 3 న విరుచుకుపడిన ఫొని తుపాను పూరీని కకావికలం చేసిని విషయం తెలిసిందే. దీనినుంచి బయట పడుతున్న వేళ ఈ ఏడాది రథయాత్రకు ముందు కరోనా మహమ్మారి పురుషోత్తమధామాన్ని కళావిహీనం చేసింది. భక్తులు లేని శ్రీక్షేత్రం, సందర్శకుల లేమితో తీర ప్రాంతం వెలవెలబోతున్నాయి.
రెండు వేలమందితో... ఇదిలా ఉండగా ఈసారి రథయాత్రలో సుమారుగా రెండు వేల మంది సేవాయిత్ లకు ఇప్పటికే కరోన పరీక్షలు పూర్తయ్యాయి. రథయాత్ర జరపటానికీ సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని వీరు భావిస్తున్నారు.