మనీ లాండరింగ్ కేసులో సానా సతీశ్‌పై ఈడీ చార్జ్‌షీట్
ABN , First Publish Date - 2020-02-12T21:35:46+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో సానా సతీశ్‌పై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీని..
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో సానా సతీశ్‌పై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీని మనీ లాండరింగ్ కేసు నుంచి బయటపడేసేందుకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ముడుపులు చెల్లించానని సతీశ్ ఆరోపించాడు. రూ.2.9 కోట్లు లంచం అడిగారని సానా తెలిపాడు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. సీబీఐలో అంతర్యుద్ధానికి దారి తీసింది. ఆనాటి డైరెక్టర్ అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా ఒకిరపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. జేడీపై దర్యాప్తుకు డైరెక్టర్ అలోక్ ఆదేశించారు. అయితే తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ సీబీఐ కోర్టు.. ఈ ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. రాకేశ్ ఆస్థానాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సానా సతీశ్ ఆరోపణలు అవాస్తవం అని తేల్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ఏడబ్ల్యూ) చీఫ్ ఎస్‌కే గోయల్‌తో పాటు సీబీఐ డీఎస్సీ దేవేందర్ కుమార్‌కు కూడా దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది.