త్వరలోనే గగన్‌యాన్‌ ప్రాజెక్టు: ఇస్రో చైర్మన్‌ శివన్‌

ABN , First Publish Date - 2020-10-14T07:39:19+05:30 IST

మానవసహిత అంతరిక్ష ప్రాజెక్టు గగన్‌యాన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని భారత అం తరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ తెలిపారు.గగన్‌యాన్‌ ప్రాజెక్టులో వ్యోమగాములకు రష్యా, ఫ్రాన్స్‌ శిక్షణ అందిస్తున్నాయని ఆయన చెప్పారు...

త్వరలోనే గగన్‌యాన్‌ ప్రాజెక్టు: ఇస్రో చైర్మన్‌ శివన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 13: మానవసహిత అంతరిక్ష ప్రాజెక్టు గగన్‌యాన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని భారత అం తరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ తెలిపారు.గగన్‌యాన్‌ ప్రాజెక్టులో వ్యోమగాములకు రష్యా, ఫ్రాన్స్‌ శిక్షణ అందిస్తున్నాయని ఆయన చెప్పారు. కొవిడ్‌ కారణంగా ఈ ప్రాజెక్టులో చిన్నపాటి మార్పులు ఉంటాయని అన్నారు.


అంతర్జాతీయ వ్యోమగాముల కాంగ్రెస్‌ (ఐఏసీ) 2020 సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతరిక్ష సహకార రంగంలో 59 దేశాలతో 250 ఒ ప్పందాలు కుదుర్చుకున్నామని, దీంతో ఈ రంగంలో భారత శక్తిసామర్థ్యాలు మరిం త పెరగనున్నాయని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌తో భారీఎత్తున సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. నవంబరులో పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-10-14T07:39:19+05:30 IST