హిందూ మున్నాని వ్యవస్థాపకుడు కన్నుమూత

ABN , First Publish Date - 2020-10-01T17:16:38+05:30 IST

హిందూ మున్నాని వ్యవస్థాపకుడు రామగోపాలన్‌ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

హిందూ మున్నాని వ్యవస్థాపకుడు కన్నుమూత

చెన్నై : హిందూ మున్నాని వ్యవస్థాపకుడు రామగోపాలన్‌ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఇటీవల కరోనా సోకి ఆయన తీవ్ర అస్వ స్థతకు గురయ్యారు. ఇంటివద్దే ఉంటూ చికిత్స తీసుకు న్నారు. మంగళవారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమిం చటంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేశారు. చికిత్స ఫలించక బుధవారం మధ్యా హ్నం మృతి చెందారు. రాష్ట్రంలో 1980లో హిందువుల పరి రక్షణ కోసం ఆయన ‘హిందూ మున్నాని’ సంస్థను ప్రారంభించారు. 


రాష్ట్రంలో హిందూ దేవా లయాల పున రుద్ధరణకు ఆయన పలు ఉద్య మాలు  కూడా చేపట్టారు. ప్రత్యే కించి వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో విగ్రహాలు పెట్టి వేడుకలను వైభవంగా నిర్వహించేవారు. చెన్నై ట్రిప్లికేన్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపును ఓ మసీదు రోడ్డులో వెళ్ళనీయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటి నుంచి రామ గోపాలన్‌ ప్రతియేటా నిమజ్జన కార్యక్రమంలో నిషేధిత మార్గాల్లో మట్టి గణపతి ప్రతిమను పట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించి అరెస్టయ్యే వారు. రామగోపాలన్‌ మృతి పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Updated Date - 2020-10-01T17:16:38+05:30 IST