మద్యంపై 50 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-17T21:45:24+05:30 IST

విస్కీ, బీర్, వైన్ సహా అన్ని రకాల మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మద్యంపై 50 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించిన ప్రభుత్వం

శ్రీనగర్: మద్యంపై జమ్మూకశ్మీర్ ప్రభుత్వం 50 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. విస్కీ, బీర్, వైన్ సహా అన్ని రకాల మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో రాష్ట్రాలకు ఆదాయం లేకుండా పోయింది. దీంతో ఆయా ప్రభుత్వాలు ఆదాయం పెంచుకునేందుకు మద్యం విక్రయాలు ప్రారంభించాయి. అంతేకాదు మద్యం బాటిళ్ల ఎంఆర్‌పీ‌పై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75 శాతం, ఢిల్లీ సర్కారు 70శాతం ధరలు ఇప్పటికే పెంచాయి.


ఇదే క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కూడా ఆదాయం పెంచుకునేందుకు మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ విధించింది. ఈ నెల 18 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రభుత్వాలు ధరలు ఎంతగా పెంచినా మద్యం ప్రియులు మాత్రం కొనేందుకు వెనుకాడటం లేదు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. 

Updated Date - 2020-05-17T21:45:24+05:30 IST