కోవిడ్ కేర్ సెంటర్‌గా మారిపోయిన కోరమంగళ ఇండోర్ స్టేడియం
ABN , First Publish Date - 2020-06-28T23:02:51+05:30 IST
కంఠీరవ ఇండోర్ స్టేడియంను కోవిడ్-19 కేర్ సెంటర్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని బృహత్ బెంగళూరు
బెంగళూరు: కంఠీరవ ఇండోర్ స్టేడియంను కోవిడ్-19 కేర్ సెంటర్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) చివరి నిమిషంలో మార్చుకుంది. కోరమంగళ ఇండోర్ స్టేడియాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చాలని తాజాగా నిర్ణయించింది. ఈ స్టేడియంలో 400-450 బెడ్ల వరకు పట్టే సామర్థ్యం ఉందని అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నాటికి ఈ సెంటర్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. అక్కడ ప్రతీ వంద మంది రోగులకు ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.