కరోనా ఎఫెక్ట్: జూలో జంతువులకు అందని మాంసం

ABN , First Publish Date - 2020-04-01T13:02:03+05:30 IST

యూపీలోని ఘాజీపూర్ వద్ద నున్న స్లాటర్ హౌస్ మూసివేయడంతో జూ పార్కులోని జంతువులకు ఆహారం అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో మాంసం...

కరోనా ఎఫెక్ట్: జూలో జంతువులకు అందని మాంసం

న్యూఢిల్లీ: యూపీలోని ఘాజీపూర్ వద్ద నున్న స్లాటర్ హౌస్ మూసివేయడంతో జూ పార్కులోని జంతువులకు ఆహారం అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో మాంసం సరఫరా చేసేవారు తమ వ్యాపారాన్ని నిలిపివేశారు. దీంతో ఘాజిపూర్ స్లాటర్ హౌస్ తిరిగి తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పు ఎంసిడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం స్లాటర్  హౌస్ కొద్ది రోజులుగా మూసివేయడంతో జూలోని  జంతువులకు, మాంసం వ్యాపారులకు సమస్యలు తలెత్తాయి. స్లాటర్ హౌస్ లో ప్రతిరోజూ సుమారు 5 వేల జంతువులను వధిస్తుంటారని, ఫలితంగా వచ్చిన మాంసాన్ని కొంతమేరకు జూ పార్కుకు పంపుతారన్నారు. అయితే ఇప్పుడు స్లాటర్ హౌస్ తెరిస్తే సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని నిర్వహించడం పెద్ద సవాలుగా మారవచ్చంటున్నారు. బయటి రాష్ట్రాల నుండి ఇక్కడికి వధించేందుకు జంతువులను తీసుకురావడం ఎంతో కష్టమన్నారు. అయితే తగిన ప్రణాళిక ద్వారా స్లాటర్ హౌస్ తెరుస్తామన్నారు.


Updated Date - 2020-04-01T13:02:03+05:30 IST