అదానీ, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-15T05:41:15+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించే వరకు అదానీ, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు కోరాయి.
కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు, ప్రజా సంఘాల ధర్నా
సుభాష్‌నగర్, డిసెంబరు 14: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించే వరకు అదానీ, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు కోరాయి. సోమవారం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శులు కేదారి, ముకుందరెడ్డి, రవి,రాజు మాట్లాడుతూ రైతాంగఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడి రైతుల ఆత్మవిశ్వాసాన్ని కేంద్ర మంత్రులు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమం పాకిస్థాన్, చైనా దేశాల ప్రోద్భలంతో జరుగుతోందంటూ కేంద్ర మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రపంచవ్యప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేయ కుండా 9ప్రతిపాదనలు చేయడాన్ని ఒప్పుకునే ప్రసక్తేలేదన్నారు. వ్యవ సాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ డిసెంబర్ 14నుంచి 20వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుల ఉద్యమానికి మద్దతుగా దీక్షా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వర్ణ వెంకట్‌రెడ్డి, సృజన్‌కుమార్, వసీం అహ్మద్, ఎడ్ల రమేశ్, యు శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, బుచ్చన్న యాదవ్ పాల్గొన్నారు.