కరోనా కట్టడికి విస్తృత చర్యలు
ABN , First Publish Date - 2020-03-21T06:32:07+05:30 IST
కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చ ర్యలు తీసుకుంటోంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 10 మంది
- రెండో రోజు 50,910 మందికి స్ర్కీనింగ్
- రద్దయిన ముఖ్యమంత్రి పర్యటన
- థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చిన ఒకరితో పాటు స్థానికుడిని గాంధీకి తరలింపు
- జలుబు, దగ్గు ఉన్న 34 మందికి హోం క్వారంటైన్
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్): కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చ ర్యలు తీసుకుంటోంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 10 మంది మతప్రచారకుల్లో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కరోనా ఎఫెక్టుతో కరీంనగర్ జిల్లాలో రెండో రోజూ కూడా అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. శనివారం పరిస్థితిని సమీక్షించేందుకు ము ఖ్యమంత్రి కరీంనగర్‌కు వస్తారని ప్రచా రం జరిగింది. దాదాపు పర్యటన ఖరారు అయినప్పటికీ చివరి నిమిషంలో రద్దయింది.
ఇంటింటి సర్వేలో..
కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో రెండో రోజు ప్ర త్యేక బృందాలు 13,428 ఇళ్లను సందర్శిం చాయి. ఇందులో 50,910 మంది సమాచారాన్ని సేకరించారు. వారంతా ఎలాంటి ఆరో గ్య సమస్యలు ఎదుర్కోవడం లేదని గుర్తించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 23 మందికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండడంతో స్థానిక జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. విదేశాలకు వెళ్లకున్నా జలుబు, దగ్గుతో బాధపడుతున్న మరో 11 మందిని 14 రోజులపాటు బయట సంచరించకుండా ఇంటికే పరిమితం కావాలని సూచించారు. థాయ్‌లాండ్‌కు వెళ్లి వచ్చిన ఒకరితో పాటు మరొకరికి కూడా జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు తీవ్రంగా ఉండడం తో కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ గాం ధీ ఆస్పత్రికి పంపించారు. జిల్లావ్యాప్తంగా విదేశాలకు వెళ్లివచ్చిన వారిని గుర్తించి వారి ఎడమ చేతిపై హోం క్వారంటైన్ విధిస్తున్నట్లు ముద్ర వేస్తున్నారు. ఎప్పటి వరకు వారు ఇంటికే పరిమితం కావాలో ఆ ముద్రలోనే సూచిస్తున్నారు. ఎడమ చేతిపై ముద్ర ఉన్న వారు ఎవరైనా బయట సంచరిస్తున్నట్లు కనిపిస్తే ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
రెండు రోజుల్లో..
గడిచిన రెండు రోజులుగా 19,552 ఇళ్లను ప్రత్యేక బృందాలు సందర్శించి 76వేల మంది ప్రజల ఆరోగ్య పరిస్థితుల వివరాలను సేకరించాయి. కరీంనగర్ పట్టణంలో ప్రతి ఇంటి సమాచారం సేకరించే వరకు బృందాలు పర్యటిస్తాయని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. మంత్రి శుక్రవారం కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూ చనలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు స్వయంగా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో కెమికల్ స్రే చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటికే పరిమితం కావడం, గుంపులు, గుంపులుగా తిరుగక పోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ను కట్టడి చేయవచ్చని ప్రజలకు సూచించారు. కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణపై తీసుకోవలసిన జాగ్రత్తలపై మండలస్థాయి అధికారులతో వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లా జైలు లో ఖైదీలను వారి బంధువులు కలిసే విషయంలో నిబంధనలను తాత్కాలికంగా మా ర్చారు. గతంలో ఖైదీలను నెలలో రెండు సార్లు స్వయంగా కలిసేందుకు, రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు అవకాశముండేది. కరోనా నేపథ్యంలో నేరుగా బంధువులు కలువడాన్ని రద్దు చేశా రు. నెలలో నాలుగుసార్లు ఖైదీలతో ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం కల్పించారు.
సానిటేషన్ డ్రైవ్..
కరోనా వైరస్‌ను అరికట్టేందు కు నగరంలోని 60డివిజన్లలో నగర పాలక సంస్థ ఆధ్వరంలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభిం చారు. 60 డివిజన్లలో చెత్తాచెదారాన్ని తొలగించ డంతోపాటు బ్లీచింగ్, ఫినాయిల్ చేయడం వంటి చర్యలను చేప డుతు న్నారు. కార్పొరేటర్లు వారి వారి డివిజన్లలో ఇం టింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నారు. వీలైనంత మేరకు ప్రతి ఒక్క రూ ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసర మైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నా రు. ముందస్తు జాగ్రత్తలు తీసు కుంటే కరోనా కట్టడి చేయవచ్చని ప్రజలు సహక రించాలని కోరారు. దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని..
విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవలికాలంలో వివిధ దేశాలకు వెళ్లి కరీంనగర్ జిల్లాకు తిరిగి వచ్చిన వారి వివరాలను సేకరించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. వారిని ఈనెలాఖరువరకు హోం క్వారంటైన్‌లో ఉండాల ని సూచిస్తున్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవా రిని హాస్పిటల్ క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తు న్నారు. ఈ మేరకు వారి ఎడమ చేతిపై అందుకు సంబంధించిన ముద్రలు వేస్తున్నారు. వివిధ దేశా లకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వివరాలను మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన వారి సంఖ్య 375 మంది అని చెప్పారు. వీరిలో 70 మంది కరీంనగర్ పట్టణానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఇతర ఎయిర్‌పోర్టులలో దిగి జిల్లాకు చేరుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరందరిని 28 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయించారు. వారి ఎడమ చేతులపై క్వారంటైన్ ముద్రలను శనివారం నుంచి వేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ముద్రలు చేయించారు.