తెలంగాణ తల్లి సోనియా గాంధీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ABN , First Publish Date - 2020-12-10T03:08:16+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తె లంగాణ తల్లి అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొనియాడారు.

తెలంగాణ తల్లి సోనియా గాంధీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
మదనాపురంలో సోనియాగాంఽధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు


మదనాపురం, డిసెంబరు 9:  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తె లంగాణ తల్లి అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  కొనియాడారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు.  నాయకులు జగదీష్‌, వడ్డెకృష్ణ, రామకృష్ణ, మహేష్‌కుమార్‌, రామకృష్ణ, వడ్డె బాలస్వామి, శేఖర్‌రెడ్డి, నాగన్న, హసన్‌ పాల్గొన్నారు.

ఘనంగా వేడుకలు 

కొత్తకోట: స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు ఏఐసీసీ అధ్య క్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌గౌడ్‌ కేక్‌కట్‌ చేసి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తులుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. రాఘవేందర్‌గౌడ్‌, వెంకటరమణ, వడ్డె వెంకటేష్‌, కరాటే శ్రీను, సాయన్నగౌడ్‌, మోహన్‌ నాయక్‌, అశోక్‌ కుమార్‌, యాదగిరి, మహేష్‌, రాములు, ప్రవీణ్‌ కుమార్‌ తదితదరులు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ 

పెబ్బేరు/ రేవల్లి: సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. అక్కి శ్రీనివాస్‌గౌడ్‌, విజయవర్దన్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌, సత్యం, దయాకర్‌రెడ్డి, షకీల్‌, యుగంధర్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, రాములు, సర్వేష్‌, సాయిగౌడ్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.రేవల్లి మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వాడల పర్వతాలు ఆధ్వర్యంలో   ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎంపీటీసీ అంజనమ్మ, రాములు, మన్నూరు నరసింహ, కావలి వెంకటేష్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి 

పెద్దమందడి : కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని నాయకులు కొమ్ము చెన్నయ్య, చవ్వ పెంటయ్య అన్నారు. సోనియాగాంధీ జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయిభార్గవి, రాజశేఖర్‌ ఎండీ. జావేద్‌,  సుదర్శన్‌, కొమ్ము భీమయ్య, కొమ్ము వెంకటన్న పాల్గొన్నారు. 





Updated Date - 2020-12-10T03:08:16+05:30 IST