పట్ట భద్రుల కసరత్తు షురూ
ABN , First Publish Date - 2020-08-26T10:08:09+05:30 IST
నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ పట్టుభద్రుల స్థానం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీకానుం ది. ఈ ఎన్నికకు సంబంధించి
నల్లగొండ నియోజకవర్గం నుంచి కోదండరాం
బరిలో చెరుకు, రాణిరుద్రమ, విజయ్, పీవీ.శ్రీనివాస్
నల్లగొండ, ఆగస్టు25(ఆంధ్రజ్యోతిప్రతినిధి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ పట్టుభద్రుల స్థానం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీకానుం ది. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదుకు సెప్టెంబరు మాసంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల ప్రక్రియ సన్నాహాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నల్లగొండ నుంచి ప్రొఫెసర్ కోదండరాం బరిలో ఉంటారని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రకటించింది. ఇక అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు పలువురు జర్నలిస్టులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. యువ తెలంగాణ, తెలంగాణ ఇంటిపార్టీ సైతం మండలి బరిలో ఉండే అవకాశం ఉంది.
నల్లగొండ నుంచి కోదండరాం
నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ నుంచి బరిలో దిగాలని సోమవారం టీజేఎస్ కేంద్ర కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆ పార్టీ కసరత్తు వేగవంతం చేసిం ది. నల్లగొండ పట్టుభద్రుల నియోజకవర్గం పరిధిలో ని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం,కోదండారామ్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై దృష్టి నిలిపింది. మూడు జిల్లాలో టీజేసీ కమిటీలు, క్యాడర్ ఉండటం, పార్టీని సమర్ధంగా నడపడం వంటివి కలసివస్తాయన్నది కోదండరాం అంచనా. ఇది ఓ భాగమైతే పీపు ల్స్ ఫ్రంట్ వేదిక ఏర్పాటుచేసి ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యర్థిగా ఉండాలనే ఆలోచనలో సైతం కోదండరాం ఉన్నట్టు సమాచారం. ఆయనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తే రాజకీయం రంజుగా మా రే అవకాశం ఉంది.
బరిలోదిగే యోచనలో పలువురు
ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ బరిలో నిలవాలని పలువురు యోచిస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకుసుధాకర్ ఆ మేరగా ఆలోచన చేస్తున్నా రు. అందుకు కసరత్తు ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేయ గా, నల్లగొండలో వ్యక్తిగతంగా సంప్రదింపులు చేస్తున్నారు. తెలంగాణ సాధకుడిగానే బరిలో ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయనక కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. ట్రాన్స్‌కో ఇతర పట్టభద్రుల సం ఘాలతోనూ తన అభ్యర్థిత్వానికి సంబంధించి ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. జాతీయ కాంగ్రె స్ రాజకీయాలు గాడినపడే వరకు వేచిచూసే ధోరణిలోనే ఉండాలన్న యోచనలో విజయ్ ఉన్నట్టు సమాచారం.
ఇక యువతెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ పోటీకి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆమె నల్లగొండ జిల్లాలో పార్టీ అధ్యక్షుడు జిట్టా సహకారం తో ప్రచారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ నేరుగా బరిలో దిగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆరేళ్ల క్రితం అప్పటి పరిస్థితులను బట్టి పల్లా రాజేశ్వరరెడ్డి ని బరిలో దించింది. నాటికీ నేటికి చాలా తేడా వచ్చింది. ఉద్యోగాల నియామకాలు లేక యువత ఆగ్రహంగా ఉన్నారు. పల్లా ప్రస్తుతం రైతు సమన్వ సమితి చైర్మన్‌గా కేబినెట్ హోదాలోనే ఉన్నారు.
దీంతో ఆయన మరోమారు పట్టభద్రుల బరిలో దిగకపోవచ్చన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్ పట్టుభద్రుల విషయంలో పోటీకి దూరంగా ఉం డాలని అధికార టీఆర్‌ఎస్ నిర్ణయించింది. అయితే చంద్రశేఖర్‌గౌడ్ పట్ల సదాభిప్రాయం ఉందని సర్వే నివేదికల్లో తేలడంతో ఆయనకు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికతో నేటికీ అధికార పార్టీకి అక్కడి పరిస్థితులు జఠిలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉంటుందా, లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. టీఆర్‌ఎస్ మద్దతు కోసం సీనియర్ జర్నలిస్ట్, ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ.శ్రీనివాస్ తన ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో పీడీఎ్‌సయూ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండగా, తన అభీష్ఠాన్ని ఇప్పటికే టీఆర్‌ఎస్ అధిష్ఠానం ముందు పెట్టారు.