జిల్లా ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలు
ABN , First Publish Date - 2020-12-07T05:00:49+05:30 IST
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలోనే ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానుంది.
వారం రోజుల్లో మిషన్ వచ్చే అవకాశం
నల్లగొండ అర్బన్, డిసెంబరు 6 : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలోనే ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఈ సేవలు అందుబాటులో లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెలుతున్న రోగులకు ఉపశమనం లభించనుంది. వారం రోజుల్లోనే మిషన్ రానుంది. దీని ఖరీదు సుమారు రూ.3కోట్లకు పైగా ఉంటుందని ఆస్పత్రి నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రికి ప్రతిరోజూ సుమారు 800 పై చిలుకు అవుట్ పేషంట్లు, సుమారు 400వరకు ఇన్‌పేషంట్లు వస్తున్నా రు. రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎంఆర్‌ఐ స్కానింగ్‌ను అ ందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు వేల రూపాయలు ఖర్చు చేసి ఈ స్కానింగ్ చేయించుకోవడం తలకుమించిన భారంగా మారింది. దీంతో ఎంతోమంది పేద వారు ఈ స్కానింగ్ చేయించుకోలేక ఒంట్లో ఏ జబ్బు ఉందో తెలియక ఎంతో మంది మృతిచెందిన సంఘటనలు సైతం ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పేద, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఖరీదైన వైద్యసేలు జిల్లా ఆస్పత్రికి అందుబాటులోకి తేవడంతో రోగులకు ఎంతో మేలు చేకూరనుంది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జనరల్ ఆస్పత్రి లో అధునాతన వైద్య చికిత్సలు అందించే యంత్ర పరికరాలు, వైద్యులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం నూతన విధానాలు, పరికరాలను సమకూరుస్తూ ప్రభుత్వ వైద్యరంగాన్ని పేదల ముందుకు తెస్తోంది. ఆసుపత్రిలో ఇప్పటికే 1300లీటర్ల ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. 170పడకలకు ఆక్సిజన్ ప్లాంటు ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ప్లాంటు ఏర్పాటుతో ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత తీరింది. మత, శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం సెంట్రల్ ఆక్సిజన్ సిస్టంను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
అధునాతన వైద్య చికిత్సలు
జిల్లా ఆస్పత్రిలో రోగులకు అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎంతో క్రిటికల్ ఆపరేషన్లు సైతం జిల్లా ఆస్పత్రి వైద్యులు నైపుణ్యంతో చేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ల్యాప్రోస్కొపిక్ లాంటి ఆపరేషన్లు సైతం ఇక్కడే జరుగుతున్నాయి. మెడికల్ కళాశాల అనుబంధంగా ఉండడంతో ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులు ఇతర సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతున్నారు. క్యాన్సర్ వ్యాధికి సైతం వైద్య చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. 50పడకలతో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్డు అందుబాటులోకి వస్తే ఇక నుంచి క్యాన్సర్ రోగులకు సైతం జిల్లా ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందనుంది. ఆస్పత్రి రోగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, పరికరాలు, వ్యాధులకు సంబంధించిన వైద్యం అందించేందుకు ఒక్కొక్కటిగా సమకూరుతున్నాయి. అధునాతన ఐసీయూ, సిటీ స్కాన్‌తో పాటు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ యూనిట్ సైతం అందుబాటులోకి వచ్చి ఎంతో మందికి మెరుగైన సేవలందిస్తున్నాయి.
అందుబాటులో అన్ని రకాల వైద్య చికిత్సలు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆస్పత్రికి వచ్చిన పేషంట్లకు ఎక్క డా ఇబ్బంది కలగకుండా అధునాతన పరికరాలతో వైద్యం అందిస్తు న్నాం. ప్రభుత్వం ఆస్పత్రికి కావాల్సిన అన్ని పరికరాలతో పాటు సౌకర్యాలను సమకూరుస్తోంది. ప్రతిరోజూ వచ్చే రోగులకు ఎంఆర్‌ఐ స్కా నింగ్ తీసుకోవడం ఆర్థిక భారంగా మారింది. దీంతో ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించి వారం రోజుల్లోనే ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్‌ను ఆస్ప త్రిలో అందుబాటులో ఉంచనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తి కావచ్చాయి. రోగులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను స ద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలి.
- ఎం.నర్సింహ, ఆస్పత్రి సూపరింటెండెంట్