108, 104 డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-12-19T06:11:35+05:30 IST
జిల్లాలో అరబిందో సంస్థ నిర్వహిస్తున్న 108, 104 వాహనాల డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ సుబ్రహ్మ ణ్యం శనివారం ప్రకటనలో తెలిపారు.
అనంతపురం వైద్యం, డిసెంబరు 18: జిల్లాలో అరబిందో సంస్థ నిర్వహిస్తున్న 108, 104 వాహనాల డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ సుబ్రహ్మ ణ్యం శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు జిల్లా ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో బయోడేటాతో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు 8790119419 నెంబరులో సంప్రదించాలన్నారు.