యువకుడి హత్య

ABN , First Publish Date - 2021-06-08T06:14:15+05:30 IST

మండలంలోని మలకాపురం గ్రామంలో సోమవారం మద్యంమత్తు లో గొడవపడి యువకుడు గోపాల్‌ (38)ను అదే గ్రా మానికి చెందిన శ్రీనివాసు లు హత్య చేశాడు.

యువకుడి హత్య
మృతి చెందిన గోపాల్‌

రాయదుర్గం రూరల్‌, జూన 7 : మండలంలోని మలకాపురం గ్రామంలో సోమవారం మద్యంమత్తు లో గొడవపడి యువకుడు గోపాల్‌ (38)ను అదే గ్రా మానికి చెందిన శ్రీనివాసు లు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. గో పాల్‌, శ్రీనివాసులు స్నేహితులు. ఇటీవల ఇద్దరి మధ్య చిన్నపాటి తగవు జరగడంతో మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామంలోని స్కూ లు వద్ద ఎదురుపడ్డారు. తాగిన మైకంలో మనస్ఫర్థలతో ఒకరినొకరు తిట్టుకున్నారు. ఆవేశానికి లోనైన శ్రీనివాసు లు ఒక్కసారిగా గోపాల్‌ ఛాతీపై కాలితో తన్నాడు. చాలా రోజుల నుంచి గుండెజబ్బుతో బాధపడుతున్న గోపాల్‌ ఒక్కసారిగా కుప్పకూలి నేలకొరిగాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.  మృతుడికి భార్య రేణుకమ్మ, కుమార్తె వున్నారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ ఈరణ్ణ తెలిపారు.

Updated Date - 2021-06-08T06:14:15+05:30 IST