సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ రంగులు

ABN , First Publish Date - 2021-09-07T06:09:49+05:30 IST

గ్రామాల్లో పంచాయతీల ఆధీనంలోని చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేశారు.

సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ రంగులు
రాప్తాడులో సంపద తయారీ కేంద్రానికు వైసీపీ రంగులు వేసిన దృశ్యం

రాప్తాడు, సెప్టెంబరు 6: గ్రామాల్లో పంచాయతీల ఆధీనంలోని చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేశారు. గతంలో నిర్మించిన వాటికి కూడా పాత రంగులు తొలగించి వైసీపీ రంగులు వేయ డంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  మండలం లో మొత్తం 16 గ్రామం పంచాయతీలుండగా గొళ్లపల్లి, గాండ్లపర్తి మినహా మిగతా 14 పంచాయతీల్లో సంపద తయారీ కేంద్రాలు నిర్మించారు. దాదాపు అన్నిటికీ ఇప్పు డు వైసీపీ రంగులు వేశారు. కోర్టులు ప్రభుత్వాన్ని మందలించినా మళ్లీ ఇప్పుడు సంపద తయారీ కేం ద్రాలకు వైసీపీ రంగులు వేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వారు సూ చించిన రంగులు వేయించినట్లు మండల అధికారులు తెలిపారు. 

చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసినేపల్లిలో కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హైకోర్టు ఆ దేశాలను బేఖాతర్‌ చేస్తూ... చెత్తతో సంపద తయారీ కేం ద్రానికి వైసీపీ రంగులు వేయడం విమర్శలకు తావిస్తోం ది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో  నిర్మించిన ఈ కేంద్రానికి వైసీపీ రంగులు వేయడం వెనుక ఔచిత్యం ఏమిటోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని నిలువరించాల్సిన అధికారులు నిస్సహాయస్థితిలో ఉండ టం సర్వ సాధారణమైపోయిందని  అంటున్నారు.


Updated Date - 2021-09-07T06:09:49+05:30 IST