రాహు-కేతు పూజల్లో ఛత్తీ్‌సఘడ్‌ ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2021-03-28T06:30:21+05:30 IST

ముక్కంటి దర్శనార్థం శనివారం ఛత్తీ్‌సఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాగెల్‌ కుటుంబసభ్యులతో కలసి శ్రీకాళహస్తి విచ్చేశారు.

రాహు-కేతు పూజల్లో ఛత్తీ్‌సఘడ్‌ ముఖ్యమంత్రి
రాహు-కేతు పూజల్లో పాల్గొన్న భూపేష్‌ భాగెల్‌

శ్రీకాళహస్తి, మార్చి 27: ముక్కంటి దర్శనార్థం శనివారం ఛత్తీ్‌సఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాగెల్‌ కుటుంబసభ్యులతో కలసి శ్రీకాళహస్తి విచ్చేశారు. ఆయనకు సుపథ మండపం వద్ద ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్న సీఎం, అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2021-03-28T06:30:21+05:30 IST