రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-31T07:50:44+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గురువారం ఇద్దరు దుర్మరణం చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐలు ఈశ్వరయ్య, సునీల్‌ మీడియాకు వివరాలను తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
సుబ్బనర్సమ్మ, లక్ష్మయ్య మృతదేహాలు

ముగ్గురికి తీవ్రగాయాలు


రేణిగుంట, డిసెంబరు 30: రోడ్డు ప్రమాదంలో గురువారం ఇద్దరు దుర్మరణం చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐలు ఈశ్వరయ్య, సునీల్‌ మీడియాకు వివరాలను తెలిపారు. కడపజిల్లా రాజంపేట  మండలం చెర్లోపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ఎం.సుబ్బనర్సమ్మ(60), హెచ్‌.లక్ష్మయ్య(40), సిద్ధయ్య(37), భాను(25), శేఖర్‌(18)లు చెన్నై విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతానికి వచ్చేసరికి వీరి కారు లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా, ఎదురుగా మరో లారీ వచ్చింది. దాన్ని చూసి వాహనాన్ని అదుపు చేసే క్రమంలో కారు డ్రైవర్‌ బ్రేక్‌ వేయగా.. వెనుక నుంచి వస్తున్న వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హెచ్‌.లక్ష్మయ్య, ఎం.సుబ్బనర్సమ్మ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సిద్ధయ్య, భాను, శేఖర్‌ తీవ్రంగా గాయపడటంతో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించినట్లు ఎస్‌ఐలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు రుయాస్పత్రికి చేరుకున్నారు. సుబ్బనర్సమ్మ జీవనోపాధికోసం ఖతర్‌ వెళ్లి.. సంక్రాంతి పండగ కోసం స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు వాపోయారు. 

Updated Date - 2021-12-31T07:50:44+05:30 IST