నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2021-01-17T05:31:36+05:30 IST

అన్నవరం, జనవరి 16: సత్యదేవుడి సన్నిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి వేళంగికి చెందిన మార్ని సూర్యనారాయణ శనివారం రూ.లక్ష విరాళంగా సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈవో త్రినాథరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో దాత

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

అన్నవరం, జనవరి 16: సత్యదేవుడి సన్నిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి వేళంగికి చెందిన మార్ని సూర్యనారాయణ శనివారం రూ.లక్ష విరాళంగా సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈవో త్రినాథరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో దాతకు స్వామివారి ప్రసాదం అందించారు. 

2,886 వ్రతాలు

సంక్రాంతి సందర్భంగా ఊళ్లకు వచ్చిన భక్తులు సత్యదేవుడిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. శనివారం ఒక్కరోజు 2,886 వ్రతాలు జరగగా అన్ని విభాగాల ద్వారా రూ.23 లక్షల ఆదాయం లభించింది. సత్యదేవుడికి ప్రాకారసేవ వేడుకగా జరిగింది. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను మేళతాలాల నడుమ తూర్పురాజగోపురం వద్ద కు తోడ్కొనివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేదమంత్రాల నడుమ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. అనంతరం హారతులిచ్చి తిరిగి ప్రధానాలయానికి తీసుకెళ్లారు.

Updated Date - 2021-01-17T05:31:36+05:30 IST