మెరుగైన కంటి వెలుగు సేవలందించాలి
ABN , First Publish Date - 2021-02-23T05:45:10+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), ఫిబ్రవరి 22: జిల్లాకు మంజూరైన 41 టాబ్‌లెట్ పీసీల సహాయంతో మరింత మెరుగైన కంటి వెలుగు సేవలు అందించాలని కలెక్టర్ డిమురళీధర్‌రెడ్డి ఆప్తాలమిక్ ఆఫీసర్లకు సూచించారు. గత నవంబర్ నుంచి జిల్లాలో 60ఏళ్లు పైబడిన అవ్వా, తాతలకు వైఎస్సార్ కంటి
కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), ఫిబ్రవరి 22: జిల్లాకు మంజూరైన 41 టాబ్‌లెట్ పీసీల సహాయంతో మరింత మెరుగైన కంటి వెలుగు సేవలు అందించాలని కలెక్టర్ డిమురళీధర్‌రెడ్డి ఆప్తాలమిక్ ఆఫీసర్లకు సూచించారు. గత నవంబర్ నుంచి జిల్లాలో 60ఏళ్లు పైబడిన అవ్వా, తాతలకు వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఆప్తాలమిక్ ఆఫీసర్లకు టాబ్‌లెట్ పీసీలను సోమవారం తన ఛాంబర్‌లో కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జేసీ చేకూరి కీర్తి, డీఎంహెచ్‌వో డాక్టర్ గౌరీశ్వరరావు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ మల్లికార్జునరాజు పాల్గొన్నారు.