బద్వేలు అభివృద్ధికి పెద్దపీట
ABN , First Publish Date - 2021-03-21T04:19:11+05:30 IST
బద్వేలు మున్సిపాలిటీ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అభివృద్ధితో బద్వేలు రూపురేఖలు మార్చుతామని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష, ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి తెలిపారు.

రూ.360 కోట్లతో ప్రతిపాదనలు : డిప్యూటీ సీఎం, ఎంపీ
బద్వేలు, మార్చి 20: బద్వేలు మున్సిపాలిటీ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అభివృద్ధితో బద్వేలు రూపురేఖలు మార్చుతామని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష, ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ గోపాలస్వామి నూతన పాలకమండలి సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.360 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రెండు, మూడు రోజుల్లో పరిపాలన ఆమోదం లభిస్తుందని వారు వివరించారు. బ్రహ్మంసాగర్ కుడి, ఎడమ కాలువల పెండింగ్ పనులు త్వరలో పూర్తి చేసి బ్రహ్మంసాగర్ నుంచి బద్వేలు పెద్ద చెరువుకు నీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలోనే బద్వేలు మున్సిపాలిటీని నెం.1గా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, కడప నగర మేయర్ సురే్‌షబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతో గెలిచామన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని బద్వేలును అభివృద్ధి పరిచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సగర బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గానుగపెంట రమణమ్మ, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ రమణారెడ్డి, వైసీపీ నేత, ఏసీఎన్ ఎండీ రాగిమాను ప్రతా్‌పకుమార్, వైసీపీ నేతలు గానుగపెంట శ్రీను, గానుగపెంట నరసింహులు, లక్ష్మినరసయ్య, ప్రముఖ న్యాయవాది పీవీఎన్. ప్రసాద్, మాజీ జడ్పీటీసీ నాగభూషణం, కౌన్సిలర్లు గానుగపెంట సమత, రవితేజ, సాయి, చెవుల వెంకటేశ్వర్లు, గురుమోహన్, ఆదిత్యరెడ్డి, ఎంఆర్‌ఎ్‌ఫ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.