ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి

ABN , First Publish Date - 2021-04-06T04:41:15+05:30 IST

మాజీ ఉపప్రధాని, స్వాతం త్య్ర సమరయోధుడు బాబుజగ్జ్జీవన్‌రామ్‌ జయంతిని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు.

ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి
ప్రొద్దుటూరులో బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసినివాళులు అర్పిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 5: మాజీ ఉపప్రధాని, స్వాతం త్య్ర సమరయోధుడు బాబుజగ్జ్జీవన్‌రామ్‌ జయంతిని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బాబుజగ్జీవన్‌రామ్‌ స్వాతంత్రోద్యమంలోనూ, దేశపునర్నిర్మాణంలోనూ ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు.  ఉపప్రధానమంత్రిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి, కులవివక్షత, వివిధ సామాజిక వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మధుసూదన్‌బాబు, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షులు అంకాల్‌కొండయ్య, ఎంటీఏ రామచంద్ర, రాజు, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

కొండాపురంలో.. 

కొండాపురం, ఏప్రిల్‌ 5: మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ 113వ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. కొండాపురంలో ఎమ్మార్పీఎస్‌ ఉపాధ్య క్షుడు యల్లయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు సుబ్బ రాయుడు, మండల నాయకులు రవిశంకర్‌, నాగన్న, సూరి, కుళాయప్ప, కరుణాకర్‌ తదితరులు పాల్గొ న్నారు. అదే విధంగా మండలంలోని చామలూరు గ్రామంలో మందకృష్ణ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు తులసీరాముడు, నాగన్న తదితరులు జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. 

వైస్‌చైర్మన్‌ పదవి ఎస్సీలకు ఇవ్వాలి 


జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 5: జమ్మలమడుగు నగర పంచాయతీలో వైస్‌ఛైర్మన్‌ పదవిని ఎస్సీలకు కేటాయించా లని సమత దళిత్‌ యునైటెడ్‌ కమిటీ, దళిత సంఘాలవారు డిమాండ్‌ చేశారు. సోమవారం జమ్మలమడుగు పాత బస్టాండు సమీపాన ఎల్‌ఎంపీ లండన్‌ మిషన్‌ స్కూల్‌ ఆవరణలో ఇటీవల గెలుపొంది ప్రమాణస్వీకారం చేసిన ఎస్సీ, ఎస్టీ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్ట ణంలోని జగ్జీవన్‌రామ్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూతనం గా ఎన్నికైన ఎస్సీ కౌన్సిలర్లు సింగరయ్య, సలోమి,  విజయలతో పాటు ఎస్టీ కౌన్సిలర్‌ చిన్న నాగన్నను సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అగస్టిన్‌రాజు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-06T04:41:15+05:30 IST