ధ్యానంతో బుద్ధి కుశలత

ABN , First Publish Date - 2021-03-29T06:18:39+05:30 IST

ధ్యానం చేయడం ద్వారా మనుషుల్లో బుద్ధి కుశలత ఏర్పడుతుందని పిరమిడ్‌ మాస్టర్‌ ఎస్‌.పద్మ చెప్పారు.

ధ్యానంతో బుద్ధి కుశలత

ఆగిరిపల్లి, మార్చి 28: ధ్యానం చేయడం ద్వారా మనుషుల్లో బుద్ధి కుశలత ఏర్పడుతుందని పిరమిడ్‌ మాస్టర్‌ ఎస్‌.పద్మ చెప్పారు. ఆదివారం స్థానిక గరికపాటి పిరమిడ్‌ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో నక్కనబోయిన పండు నివాసంలో ఉచిత ధ్యాన శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం చేయడం వల్ల మానసిక వికాసంతో పాటుగా పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. అనంతరం అహింసాయుత శాకాహార ర్యాలీ నిర్వహించారు. ధ్యానమందిర నిర్వాహకులు పేరూరి రాజేష్‌ కుమార్‌, రాంబాబు, విన్నపాల లక్ష్మీనారాయణ, అమిరిశెట్టి మౌనిక, తవ్వా సత్యవాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-29T06:18:39+05:30 IST