ఐవోటీతో ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2021-10-05T06:04:11+05:30 IST

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)తో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు పడవల సతీష్‌ అన్నారు.

ఐవోటీతో ఉపాధి అవకాశాలు
ప్రసంగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు పడవల సతీష్‌

ఐవోటీతో ఉపాధి అవకాశాలు

సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు పడవల సతీష్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 4: ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)తో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు పడవల సతీష్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ ఈసీఈ విభాగం ఆధఽ్వర్యంలో ఐవోటీపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఐవోటీ నూతన సాంకేతిక విప్లవమని వర్ణించారు. మానవ మేధస్సుతో రూపొందించిన ఐవోటీతో ఎన్నో పనులు వేగవంతంగా జరుగుతాయని, విజ్ఞాన వికాసానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఎన్నో నూతన ఆవిష్కరణలు చేయవచ్చునన్నారు. ఐవోటీలో పట్టుసాధించిన విద్యార్థులకు సాంకేతిక రంగంలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ, ఐవోటీ మంచి డిమాండ్‌ ఉన్న కోర్సుగా ఉందన్నారు. ఆ దిశగా విద్యార్థులు మరింత పట్టు సాధించాలన్నారు. ఈసీఈ విభాగ అఽధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయనను సాదరంగా సత్కరించారు.

Updated Date - 2021-10-05T06:04:11+05:30 IST