జిల్లా జైలు సూపరింటెండెంట్‌కు పదోన్నతి
ABN , First Publish Date - 2022-01-01T05:28:26+05:30 IST
మండలంలోని పంచలింగాలలో ఉన్న కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న పోచా వరుణారెడ్డికి అడిషనల్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు(లీగల్), డిసెంబరు 31: మండలంలోని పంచలింగాలలో ఉన్న కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న పోచా వరుణారెడ్డికి అడిషనల్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 8 జిల్లా జెళ్లు, నాలుగు సెంట్రల్ జైళ్లలో అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పదోన్నతి పొందిన పోచా వర్ణారెడ్డి శుక్రవారం జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.