ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా : డీఎ్‌ఫవో

ABN , First Publish Date - 2022-01-01T04:42:19+05:30 IST

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎ్‌ఫవో వైవీ షణ్ముఖ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా : డీఎ్‌ఫవో
దాసరిపల్లిలో టేకు చెట్లను పరిశీలిస్తున్న డీఎ్‌ఫవో

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 31: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎ్‌ఫవో వైవీ షణ్ముఖ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అటవీ శాఖా కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్‌, అటవీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్టుకట్ట వేస్తున్నామన్నారు. ఎర్రచందనం నిల్వలు అధికంగా ఉన్న ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, రాపూరు రేంజ్‌ల పరిధిలో బేస్‌క్యాంప్‌, స్ట్రైగింక్‌ ఫోర్స్‌లతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్మగర్లు, కూలీల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అనంతరం దాసరిపల్లి గ్రామంలో టేకు చెట్ల నరికివేతకు రైతు దరఖాస్తు చేసుకోవడంతో సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. అలాగే సీతారామపురం ఎఫ్‌బీవోగా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన షేక్‌ జానీబాషాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేంజ్‌ అధికారి తుమ్మల ఉమామహేశ్వరరరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T04:42:19+05:30 IST