సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-09-07T02:44:23+05:30 IST

నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని సేవా భారతి మండల కన్వీనర్‌ జీ వేణుగోపాల్‌రెడ్డి, సభ్యులు సీహె

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం


పొదలకూరు, సెప్టెంబరు 6 : నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని సేవా భారతి మండల కన్వీనర్‌ జీ వేణుగోపాల్‌రెడ్డి, సభ్యులు సీహెచ్‌ చినసుబ్రహ్మణ్యం, ఆర్‌ ధనుంజయరావు,  జే బ్రహ్మయ్య, సమరసత సేవా ఫౌండేషన్‌ మండల అధ్యక్షుడు ఎల్‌ ఆనందరావు అన్నారు. సోమవారం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రపంచ జర్నలిస్టు డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించా లన్నారు. అనంతరం జర్నలిస్టులందరికీ సన్మానం చేశారు. కార్యక్రమంలో సేవాభారతి సభ్యులు ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-07T02:44:23+05:30 IST