కనుపూరు కాలువలో వేసవిలోనూ ప్రవాహం
ABN , First Publish Date - 2021-06-08T04:10:57+05:30 IST
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండాకాలంలోనూ బండేపల్లి బ్రాంచ్ కనుపూరు కాలువ జోరుగా ప్రవహిస్తోంది.
మనుబోలు, జూన్ 7: గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండాకాలంలోనూ బండేపల్లి బ్రాంచ్ కనుపూరు కాలువ జోరుగా ప్రవహిస్తోంది. ఈ కాలువకు అనుసంధానంగా ఉన్న చెరువులన్నీ నిండిపోగా, కింది ప్రాంతాలకు నీరు చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండో పంట పెట్టాలా, వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. సాధారణంగా కాలువ కింద ఒక పంటకు నీరందడమే కష్టం. రెండో పంట సాగు చేయాలంటే ఖర్చులు అధికం అవుతాయి. దిగుబడి తక్కువగా వస్తుంది. నీరుందని సేద్యం చేస్తే అప్పులుపాలవుతామేమోనని రైతులు డైలమాలో ఉన్నారు. అవసరం లేకున్నా ఎగువప్రాంతాల నుంచి కాలువకు నీరు వదలడంతో చెరువులు, కాలువలు జలకళ సంతరించుకున్నాయి