భక్తిశ్రద్ధలతో కోటి సోమవారం

ABN , First Publish Date - 2021-11-12T04:37:52+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయం కోటి సోమవారం సందర్భంగా కార్తీక దీపాలతో కళకళలాడింది.

భక్తిశ్రద్ధలతో కోటి సోమవారం
జొన్నవాడ ఆలయంలో కార్తీకదీపాలు వెలిగిస్తున్న భక్తులు.

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 11: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయం కోటి సోమవారం సందర్భంగా కార్తీక దీపాలతో కళకళలాడింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు ఉపవాసాలతో ఆలయానికి వచ్చారు. ముందుగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలో ఆలయ పండితులు, పురోహితులు, అర్చకులు స్వామివారికి పాలు, పంచామృత అభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి నవావరణ పూజలు చేశారు. వర్షంలోనూ భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చారు.

Updated Date - 2021-11-12T04:37:52+05:30 IST