భక్తిశ్రద్ధలతో కోటి సోమవారం
ABN , First Publish Date - 2021-11-12T04:24:23+05:30 IST
పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే కోటి సోమ వారంను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు.
మార్కాపురం(వన్‌టౌన్), నవంబరు 11: పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే కోటి సోమ వారంను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. స్థానిక జగదాంబ సమేత మార్కెం డేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఆలయ చైర్మన్ రెంటచింతల మధు సూదనశర్మ మార్కండేశ్వరునికి ప్రత్యేక అభి షేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు మా ర్కండేశ్వరునికి జగదాంబమాతకు పూజలు చేశారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచారు. ఈవో ఈదుల చెన్నకేశ్వరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి
కల్యాణం
మార్కాపురం(వన్‌టౌన్), నవంబరు 11: స్థానిక గుండ్లకమ్మ నదీతీరాన వెలిసయున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామికి వైభ వంగా కల్యాణం నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం కావడంతో అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు మూలవిరాఠ్‌కు లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరుని ఉత్సవ మూ ర్తులకు విశేష అలంకరణ ప్ర త్యేక పూజలు ని ర్వహిం చారు. అనంతరం వైభవంగా కల్యాణ ఘట్టాలు నిర్వహిం చారు. 18 మంది ఉభయ దాతలుగా పాల్గొన్నారు.
కంభంలో..
కంభం : కార్తీక శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి కల్యాణం వైభ వంగా జరిగింది. పలువురు దంపతులు కల్యాం ణంలో కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
కోటి దీపోత్సవం వాయిదా
గురువారం సాయంత్రం 6 గంటలకు దేవస్థాన ఆవరణలో జరగాల్సిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో దీనిని వాయిదా వేసినట్లు తెలిపారు.