వాన కోసం దుర్గమ్మకు బోనాలు
ABN , First Publish Date - 2021-10-31T05:30:00+05:30 IST
వానలు కురవాలని గ్రామ దేవతకు బోనాలు సమ ర్పించారు. జంతు బలులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ శివారులో వంటావార్పు
ఎర్రగొండపాలెం, అక్టోబరు 31 : వానలు కురవాలని గ్రామ దేవతకు బోనాలు సమ ర్పించారు. జంతు బలులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని బోయలపల్లి, ఎర్రగొండపాలెం గ్రామాల ప్రజలు ఆదివారం గ్రామ శివారులో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. సంవృద్ధిగా వర్షాలు కురిసి తాగు, సాగు నీటికి లోటు లేకుండా చూడమ్మా అని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి, ఎర్రగొండపాలెం గ్రామాల ప్రజలు వర్షాలు సంవృద్ధిగా కురవాలని ఆదివారం గ్రామదేవతలకు సామూహిక బో నాలు సమర్పించారు. కనకదుర్గమ్మ బొమ్మను త యారు చేసి గ్రామంలో ఊరేగింపుగా అన్ని కు టుంబాల వారు బయలు దేరారు. గంపలలో నిత్యావసర సరుకులు నింపుకొని మహిళలు ప్రదర్శ నగా గ్రామశివార్లకు చేరుకున్నారు. దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. జంతువులను బలి చ్చారు. అనంతరం వంటావార్పు చేసుకొని అం దరూ కలిసి భోజనాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఇళ్లకు చేరుకున్నారు. దుర్గమ్మకు మొక్కుకొని పొలాల్లో సామూహిక భోజనాలు చేస్తే గ్రామ దేవత కరుణించి వానలు కురుస్తాయని ప్రజల నమ్మకం.