అక్షర శిల్పి లూయీ బ్రెయిల్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-01-05T05:38:15+05:30 IST

ప్రత్యేక అవసరాలున్న పిల్లల పట్ల వివక్ష వీడాలని ఎంఈవో బీ మస్తాన్‌నాయక్‌ అన్నారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో లూయి బ్రెయిల్‌ జయంతిని సోమవారం నిర్వహించారు.

అక్షర శిల్పి లూయీ బ్రెయిల్‌కు ఘన నివాళి
బ్రెయిలీలూయిస్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న అబ్దుల్‌సత్తార్


కంభం, జనవరి 4 : ఆరు చుక్కలతో అంధుల జీవితాల్లో వెలుగులు నింపి వారిలో 64 కలలకు ప్రాణం పోసిన అక్షర శిల్పి లూయిస్‌బ్రెయిల్‌ అని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌సత్తార్‌ వ్యాఖ్యానించారు. లూయి బ్రెయిల్‌ జయంతిని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరల్డ్‌ బ్రెయిలీ డే వేడుకలను ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ దృశ్యవైకల్యం కలిగి ఉండి చదవలేని, రాయలేని వారి కోసం ప్రత్యేకంగా లిపిని తయారు చేసిన దార్శనికుడు బ్రెయిల్‌ అన్నారు. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత స్థానాలను అధిరోహించిన పలువురి స్ఫూర్తి గాధలు వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్యాబోధన ఉపాధ్యాయిని నూర్జహాన్‌, ఉపాధ్యాయులు భాస్కరరెడ్డి, కిరణ్‌కుమార్‌, తిరుపతమ్మ, సీఆర్‌పీ మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రత్యేక అవసరాలున్న పిల్లల పట్ల వివక్ష వీడాలి 

పెద్ద దోర్నాల : ప్రత్యేక అవసరాలున్న పిల్లల పట్ల వివక్ష వీడాలని ఎంఈవో బీ మస్తాన్‌నాయక్‌ అన్నారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో లూయి బ్రెయిల్‌ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మస్తాన్‌ నాయక్‌ బ్రెయిలీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణానాయక్‌, షరీఫ్‌, ఐఈఆర్‌పీ కోటేశ్వరరావు, సరస్వతి, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-05T05:38:15+05:30 IST