రైతు భరోసా కేంద్రాల్లో అన్నిరకాల సేవలు
ABN , First Publish Date - 2021-01-16T05:08:13+05:30 IST
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
దర్శి, జనవరి 15 : రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. పట్టణంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయం, హెల్త్ క్లీనిక్‌లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు అందించటంతోపాటు ఈ-క్రాప్ నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్ధాయి క్రికెట్ పోటీలను తిలకించారు.
కార్యక్రమంలో దర్శి, తూర్పువెంకటాపురం సొసై టీ చైర్‌పర్సన్లు వి.చెన్నారెడ్డి, ఎం.పుల్లారెడ్డి, ఏఎం.వైస్ చైర్మెన్ కర్నా శ్రీనివాసరావు, నాయకులు కె.అంజిరెడ్డి, తిరుపతిరెడ్డి, సోము దుర్గారెడ్డి, వై.వీ.సుబ్బయ్య, ముక్తినీడి సాంబ య్య, తిరుమల వెంకీ తదితరులు పాల్గొన్నారు.
కెల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
ముండ్లమూరు, జనవరి 15 : మండలంలోని కెల్లంపల్లికి నిధులు కేటాయించి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతా నని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గురువారం కెల్లంపల్లి గ్రామ వైసీపీ నాయకుడు మొదుళ్ల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేణుగోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్థులు తనపై చూపుతున్న అభిమానాన్ని ఎన్నడూ మరిచిపోనన్నారు గ్రామంలో తాగునీటితోపాటు రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మొదుళ్ల వెంకటసుబ్బారెడ్డి, కట్టా చినవెంకంబొట్లు, బిక్షాలురెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంగళరెడ్డి, మొదుళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.