మోదకొండమ్మను దర్శించుకున్న కాంతిలాల్‌ దండే

ABN , First Publish Date - 2021-01-17T05:46:12+05:30 IST

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే దంపతులు శనివారం ఉదయం మోదకొండమ్మను దర్శించుకున్నారు.

మోదకొండమ్మను దర్శించుకున్న కాంతిలాల్‌ దండే
టీడబ్లూ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి మెమోంటో అందిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.



పాడేరురూరల్‌, జనవరి 16: గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే దంపతులు శనివారం ఉదయం మోదకొండమ్మను దర్శించుకున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం పాడేరు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆయన పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, నరసింగరావు దంపతులు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు వారిని శాలువతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో డాక్టర్‌.ఎస్‌.వెంకటేశ్వర్‌, శివాలయ కమిటీ ప్రతినిధులు వెంకటరత్నం, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T05:46:12+05:30 IST