అందుకే విద్యుత్ సంక్షోభం: పల్లా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-10-13T21:20:49+05:30 IST

విద్యుత్ విషయంలో జగన్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంవల్లే రాష్ట్రంలో...

అందుకే విద్యుత్ సంక్షోభం: పల్లా శ్రీనివాసరావు

విశాఖ: విద్యుత్ విషయంలో జగన్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంవల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కరెంట్ కట్ చేస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజలు పవర్ కట్ చేస్తారని అన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 20న విశాఖకు వస్తున్నారని, అనకాపల్లిలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారని శ్రీనివాసరావు చెప్పారు.

Updated Date - 2021-10-13T21:20:49+05:30 IST