జోలాపుట్‌ డ్యాంలో 12 ద్వీపాలను టూరిజంగా అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-03-05T06:06:40+05:30 IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్‌ డ్యాంలో 12 ద్వీపాలు ఉన్నాయని, వాటిని టూరిజంగా అభివృద్ధి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండేను స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కోరారు.

జోలాపుట్‌ డ్యాంలో 12 ద్వీపాలను టూరిజంగా అభివృద్ధి చేయాలి
కాంతిలాల్‌దండేకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ



అనంతగిరి, మార్చి 4: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్‌ డ్యాంలో 12 ద్వీపాలు ఉన్నాయని, వాటిని టూరిజంగా అభివృద్ధి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండేను స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కోరారు. దీనిపై స్పందించిన ఆయన రూ.4కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. అరకులోయ డిగ్రీ కళాశాలలో సీట్ల సంఖ్య పెంచాలని, టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను పునరుద్ధరించాలని, బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌ సీట్లను కొనసాగించాలని, అర్హులైన వారందరికీ అమ్మఒడి, రైతుభరోసా కల్పించాలని, గిరిజన ప్రాంతంలో స్పెషల్‌ డీఎస్‌సీ నిర్వహించాలని కోరారు. అలాగే అనంతగిరి మండలంలో జీనబాడు పంచాయతీ పెదగంగవరంలో భూమిహక్కు కలిగి ఉన్న గిరిజనేతరులకు పక్కాఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించాలని, గిరిజనేతర పంచాయతీలను గిరిజన ప్రాంతంగా ప్రకటించాలని సెల్‌టవర్లు, ఆధార్‌ సెంటర్ల సంఖ్య పెంచాలని కోరారు. ఆయనతోపాటు వైసీపీ మండలాధ్యక్షుడు శెట్టి ఆనంద్‌ ఉన్నారు. అదేవిధంగా సీపీఎం, టీడీపీ నాయకులు ముఖ్యకార్యదర్శికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. 

 

Updated Date - 2021-03-05T06:06:40+05:30 IST