రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-12-31T06:11:18+05:30 IST
జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాం తాల్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదా ల్లో ముగ్గురు మృతిచెందారు.
రావికమతం మండలం తట్టబంద వద్ద మోపెడ్‌ని ఢీకొన్న బైక్
బుచ్చెయ్యపేట మండలం గొర్లెపాలేనికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి
‘పేట మండలం నామవరం జంక్షన్ వద్ద బొలేరోని ఢీకొన్న బైక్
నక్కపల్లి మండలం జానకయ్యపేటకు చెందిన యువకుడు దుర్మరణం
రావికమతం/పాయకరావుపేట రూరల్, డిసెంబరు 30: జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాం తాల్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదా ల్లో ముగ్గురు మృతిచెందారు. రావికమతం మం డలం తట్టబంద వద్ద మోపెడ్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీనకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పాయకరావుపేట మండలం నామ వరం జంక్షన్ వద్ద బొలేరో వాహనం బైక్‌ని ఢీకొన డంతో యువకుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.
బుచ్చెయ్యపేట మండలం గొర్లెపాలెం గ్రామానికి చెందిన అధికారి రాజబాబు (50), వెలుగుల రాము (38) బుధవారం మోపెడ్ వాహనంపై రావికమతం మండలం కశిరెడ్డిపాలెంలో ఓ దిన కార్యానికి వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాం తంలో స్వగ్రామానికి బయలుదేరారు. దారిలో తట్టబంద ఇందలివారి కల్లాల వద్ద అనకాపల్లి వైపు నుంచి బైక్‌పై వస్తున్న రోలుగుంట మండ లం జి.కొత్తూరు గ్రామానికి చెందిన జి.ప్రసాద్ ఢీకొట్టాడు. దీంతో రాజబాబు, రాము తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిసేప టి తరువాత ఆ మార్గంలో వెళుతున్న వ్యక్తులు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి, మృతదేహాలకు పంచనామా నిర్వహిం చారు. వీరిని ఢీకొన్న బైక్, వ్యక్తి అక్కడ లేకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. సుమా రు నాలుగు కిలోమీటర్ల దూరంలో గొంప మెట్ట వద్ద రోడ్డుపక్కన పడివున్న బైక్‌ని గుర్తించారు. రిజిస్ర్టేషన్ నంబర్ ఆధారంగా నిందితుడి వివ రాలు సేకరించారు. ఫోన్ చేసి ఆరా తీయగా ప్రసాద్ విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పా రు. రాజబాబు, రాము మృతదేహాలను గురువా రం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు రావికమతం ఎస్‌ఐ జోగారావు తెలిపారు.
నామవరం జంక్షన్ వద్ద...
పాయకరావుపేట మండలం నామవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. నక్కపల్లి మండలం జానకయ్యపేట గ్రామానికి చెందిన కొర్ని రాజు (19), దేవర రాజు మోటారు సైకిల్‌పై తుని వైపు వెళుతున్నారు. నామవరం జంక్షన్ వద్ద గుంటపల్లి వైపు వెళ్లే బొలేరో వాహనం అకస్మాత్తుగా వారి ముందు మలుపు తిప్పడంతో మోటారు సైకిల్ బలంగా ఢీకొన్నది. దీంతో కొర్ని రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడక్కడే మృతిచెందాడు. గాయపడిన దేవర రాజును తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ శిరీష తెలిపారు.