ధనుర్మాసోత్సవాలకు వేళాయె
ABN , First Publish Date - 2021-12-16T06:34:58+05:30 IST
ఉప మాకలో గరుడాద్రి పర్వతంపై కొలువు దీరిన వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో గురువారం మధ్యాహ్నం నుంచి ధన్ముర్మాస ఉత్సవాలు ప్రారంభం కాను న్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లను పూర్తిచేసింది.
ఉపమాక వెంకన్న ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ
నక్కపల్లి, డిసెంబరు 15 : ఉప మాకలో గరుడాద్రి పర్వతంపై కొలువు దీరిన వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో గురువారం మధ్యాహ్నం నుంచి ధన్ముర్మాస ఉత్సవాలు ప్రారంభం కాను న్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ సంద ర్భంగా ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు మాట్లాడుతూ ఈ ఆలయంలో గురువారం మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్లగ్నంలో నెల గంట ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం గోదాదేవి వ్రతదీక్షలో భాగంగా ప్రత్యేక ప్రసాద నివేదనలు, తిరుప్పావై సేవా కాలములు విన్నపం చేసిన తరువాత తిరుప్పావైలోని మొదటి పాశురముతో ప్రత్యేక నీరాజన మంత్రపుష్పములు, తీర్థగోష్ఠి తదితర క్రతువులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. జనవరి 16 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించను న్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవములు జరుగుతాయన్నారు. జనవరి 13వ తేదీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నుంచి 22వ తేదీ వరకు పదిరోజుల పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు జరుగుతా యని చెప్పారు. ఇక ధనుర్మాసంలో ప్రతిరోజూ అధ్యయనోత్సవాలు, అన్న మయ్య సంకీర్తనలు, భజనలు, ఉపన్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఇన్‌స్పెక్టర్ పృద్వీ తెలిపారు.