గాంధీజీ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2021-05-19T05:21:17+05:30 IST

పట్టణంలోని విజయనగ రం రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలి యని దుండగులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు.

గాంధీజీ విగ్రహం ధ్వంసం
ధ్వంసమైన విగ్రహం

శృంగవరపుకోట, మే 18: పట్టణంలోని విజయనగ రం రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలి యని దుండగులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. విగ్రహానికి ఉన్న రెండు కాళ్లు ధ్వంసమై ఉండడాన్ని స్థానికులు గుర్తించి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ట్రైనీ ఎస్‌ఐ శిరీష విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించా లని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని, దుండగులను గుర్తించే పనిలో ఉన్నామని ట్రైనీ ఎస్‌ఐ తెలిపారు.  

 

 

Updated Date - 2021-05-19T05:21:17+05:30 IST