ఆచంటీశ్వరుడికి అభిషేకాలు
ABN , First Publish Date - 2021-03-12T04:57:36+05:30 IST
ఉమా రామేశ్వరస్వామి ఆలయం భక్తుల శివనామ స్మరణతో హోరెత్తింది.
ఆచంట, మార్చి 11 : ఉమా రామేశ్వరస్వామి ఆలయం భక్తుల శివనామ స్మరణతో హోరెత్తింది. వేకుమజాము నుంచి సాయంత్రం వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి అభిషేకాల అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. సుమారు 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో గుబ్బల రామపెద్దింట్లురావు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొడవర్తి వెంకన్నబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేపట్టగా ఎస్‌ఐ సీహెచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అన్నదాన కమిటీ ఏర్పాటు చేసిన అన్నసమరాధనలో వేల సంఖ్య లో భక్తులు తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. ఆచంటీశ్వరుడిని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, వైజయంతిదేవి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు గుబ్బల తమ్మయ్య తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.