మావుళ్లమ్మ నిజరూప దర్శనం

ABN , First Publish Date - 2021-12-30T05:45:08+05:30 IST

మావుళ్లమ్మ నిజరూప దర్శ నంతో భక్తులు తన్మయం పొందారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి జరిగే 58వ వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మవారి మూల విరాట్‌కు రంగులు వేసే నిమిత్తం ఈ నెల 15వ తేదీ నుంచి నిజ రూపదర్శనం నిలిపివేశారు.

మావుళ్లమ్మ నిజరూప దర్శనం

భీమవరం టౌన్‌, డిసెంబరు 29 : మావుళ్లమ్మ నిజరూప దర్శ నంతో భక్తులు తన్మయం పొందారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి జరిగే 58వ వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మవారి మూల విరాట్‌కు రంగులు వేసే నిమిత్తం ఈ నెల 15వ తేదీ నుంచి నిజ రూపదర్శనం నిలిపివేశారు. రంగుల పని పూర్తికావడంతో 14 రోజుల తర్వాత బుధవారం ఉదయం ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో కళాన్యాస పూజలు చేశారు. గోదృష్టి, కుంభదృష్టి, కుష్మాండ దర్శనం, దర్ప దర్శనం తర్వాత మహాహారతి ఇచ్చి భక్తులను అనుమతిచ్చారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈవో దాసరి శ్రీరామవరప్రసాద్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:45:08+05:30 IST