వీరవాసరం రైల్వేగేటు మూసివేత
ABN , First Publish Date - 2021-03-23T04:42:59+05:30 IST
రైల్వే డబ్లింగ్ పనులలో భాగంగా వీరవాసరం – పెనుమంట్ర రహదారిపై వీరవాసరంలో ఉన్న రైల్వేగేటును సోమవారం మూసివేశారు.
వీరవాసరం, మార్చి 22: రైల్వే డబ్లింగ్ పనులలో భాగంగా వీరవాసరం – పెనుమంట్ర రహదారిపై వీరవాసరంలో ఉన్న రైల్వేగేటును సోమవారం మూసివేశారు. రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించారు. సోమ, మంగళవారాలు రైల్వేగేటును తాత్కాలికంగా మూసివేస్తారని ముందస్తుగానే అధికారులు ప్రకటించారు. వీరవాసరం – భీమవరం – పాలకొల్లు రహదారిని చేర్చి ఉన్న వీరవాసరం – పెనుమంట్ర రహదారి బస్టాండ్ వద్ద నుంచి రహదారిని మూసివేశారు. దీనితో ఈ మార్గంలో ఏ వాహనాలు వెళ్లే అవకాశం లేకపోయింది. భారీ వాహనాలు, ప్రయాణ వాహనాలు భీమవరం, పాలకొల్లు మార్గంలోనే వెళ్లాయి. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే మార్గం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సమాచారం తెలియకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురయ్యాయి.