పంచతిక్తఘ్రతము
ABN , First Publish Date - 2021-03-02T18:21:28+05:30 IST
భారతీయ ఆయుర్వేద వైద్యమునందు కుష్ఠురోగ చికిత్సలో విశేషంగా వాడుకలో ఉన్న ఔషధాలలో పంచతిక్తఘ్రతము ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి బైషజ్య రత్నావళి గ్రంథము నందు కుష్ఠురోగ చికిత్స అధ్యాయంలో చక్రదత్త, సారంగధర మొదలైన గ్రంథాలలో చెప్పడం జరిగింది.
ఆంధ్రజ్యోతి(02-03-2021)

పంచతిక్తఘ్రతాన్ని వేప, చేదు పొట్ల, వాకుడు, తిప్పతీగ, వస అనే ఐదు రకాల మూలికలు కలిపి త్రిఫల కషాయం, మరియు ఆవునేతితో కలిపి మరిగించి, పంచతిక్తఘ్రతాన్ని తయారుచేస్తారు.
పంచతిక్తఘ్రతము ఉపయోగాలు: కుష్ఠు, 80 రకాల వాత రోగాలు, 40 రకాల పిత్త రోగాలు, 20 రకాల కఫ రోగాలు, ఆర్శిస్సులు, మరియు 5 రకాల కాస రోగాలు, వేరికోస్ వెయిన్స్, తద్వారా కలిగే కాళ్లనొప్పులకు అనుపానంగా పనిచేస్తుంది. ఎగ్జీమా, డయాబెటిక్ ఫుట్ వంటి వాటిలో అనుపానంగా వాడడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.
దీనిని వైద్యరత్న, ఎస్‌ఎన్‌ఎ, కొట్టక్కల్ మొదలైన ఆయుర్వేద మందుల సంస్థలు తయారుచేస్తున్నాయి. ఉపయోగించే మోతాదు 5 నుంచి 10 గ్రాములు సాయంత్రం పాలు అనుపానంగా లేదా వైద్యుల సూచన ప్రకారం వాడుకోవాలి. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్, జైధ్యనాధ్, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.
జి.శశిధర్,అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,
సనాతన జీవన్ ట్రస్ట్, కొత్తపేట, చీరాల.