కరోనా ‘థర్డ్‌వేవ్’ అంటూ ఆదిత్య థాకరే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-04-18T21:01:17+05:30 IST

మహారాష్ట్రలో అతి త్వరలోనే కరోనా మూడోవేవ్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి ఆదిత్య

కరోనా ‘థర్డ్‌వేవ్’ అంటూ ఆదిత్య థాకరే సంచలన వ్యాఖ్యలు

ముంబై : మహారాష్ట్రలో అతి త్వరలోనే కరోనా మూడోవేవ్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి ఆదిత్య థాకరే సంచలన ప్రకటన చేశారు. అయితే రెండో వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. కోవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పని చేకపోయినా, భవిష్యత్తులో ఇది ఎంతో ఉపయోగంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా దృష్ట్యా రాష్ట్రంలో తీసుకునే ప్రతి నిర్ణయమూ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సూచించిన ప్రకారమే తీసుకుంటున్నామని, ఇందులో రాజకీయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కరోనా కేసుల విషయంలో కొందరు లెక్కలు సరిగ్గా చెప్పడం లేదని, తాము మాత్రం మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి సన్నద్ధమవుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 లక్షల పడకలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 70 శాతం ఆక్సిజన్‌తో కూడినవే అని ఆయన తెలిపారు. గతంతో పోలిస్తే రోజువారీ కూలీల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని, ఆ విషయంలో తాము కాస్త అనుభవాన్ని కూడా సాధించామని ఆదిత్య థాకరే అన్నారు. 


Updated Date - 2021-04-18T21:01:17+05:30 IST