ఏపీ సర్వీస్ ఇనాం భూములపై సుప్రీంకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-07-02T02:54:05+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్వీస్ ఇనాం భూములపై సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్వీస్ ఇనాం భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇనాం భూముల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. బాధితుల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇనాం భూములపై దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.