నోయిడా ఆసుపత్రిలో బాంబు పెట్టామంటూ ఫోన్...కలకలం

ABN , First Publish Date - 2021-01-22T15:55:27+05:30 IST

నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఫోన్ చేయడం కలకలం రేపింది....

నోయిడా ఆసుపత్రిలో బాంబు పెట్టామంటూ ఫోన్...కలకలం

నోయిడా : నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఫోన్ చేయడం కలకలం రేపింది.నోయిడాలోని సెక్టారు 27లోని కైలాష్ ఆసుపత్రి భవనం నేలమాళిగలో బాంబు ఉంచినట్లు సమాచారం రావడంతో పోలీసులు, డాగ్ స్క్వాడ్ లు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో గాలించినా ఎలాంటి బాంబు లభించలేదని, ఆగంతకుడు బాంబు పెట్టామంటూ బెదిరించాడని తేలిందని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు. బాంబు పెట్టామంటూ ఫోన్ చేసిన వ్యక్తి కోసం తాము గాలిస్తున్నామని డీసీపీ చెప్పారు. ఆసుపత్రిలో అనుమానాస్పద ప్యాకెట్ కనిపించిందని, కాని దాన్ని తెరచి చూడగా ఏమీలేదని తేలిందని పోలీసులు వివరించారు.

Updated Date - 2021-01-22T15:55:27+05:30 IST