రాజ్‌కుంద్రాకు తాత్కాలిక ఉపశమనం

ABN , First Publish Date - 2021-08-18T21:10:24+05:30 IST

పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దాఖలు చేసుకున్నముందస్తు బెయిల్ అభ్యర్థనపై..

రాజ్‌కుంద్రాకు తాత్కాలిక ఉపశమనం

ముంబై: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దాఖలు చేసుకున్నముందస్తు బెయిల్ అభ్యర్థనపై ఆయనకు ముంబై హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. దీంతో  ఆ కేసులో అరెస్టు కాకుండా మరో వారం రోజులు ఆయనకు ఉపశమనం లభించినట్టు అయింది. పోర్నోగ్రఫీ వ్యవహారంలో ముంబై సైబర్ డిపార్ట్‌మెంట్ ఈ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు దరఖాస్తును ముంబై సెషన్స్ కోర్టు ఈనెల 10న నిరాకరించింది.


కాగా, ఇదే పోర్నోగ్రఫీ వ్యవహారంలోనే క్రైం బ్రాంచ్ నమోదు చేసిన మరో కేసులో ఇప్పటికే రాజ్‌కుంద్రా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పోర్నోగ్రఫీ వీడియాలు తీస్తున్నారనే ఆరోపణలపై కుంద్రాతో సహా 11 మందిని జూలై 19న పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 5న రాజ్‌కుంద్రా, ఆయన అసోసియేట్ ర్యాన్ థోర్పే దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెట్రోపాలిటన్ కోర్టు తోసిపుచ్చింది. కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డ్‌ను రాజ్‌కుంద్రా, ర్యాన్‌ థోర్పే సవాలు చేస్తూ, తమను తక్షణం విడుదల చేయాలని ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను ముంబై హైకోర్టు కొట్టివేసింది.

Updated Date - 2021-08-18T21:10:24+05:30 IST