ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-10-06T13:33:00+05:30 IST
జిల్లాలో స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై వేలూరు జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి అప్పు, పురనగర జిల్లా
వేలూరు(చెన్నై): జిల్లాలో స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై వేలూరు జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి అప్పు, పురనగర జిల్లా సెక్రటరీ వేల్‌అయ గన్‌లు మాట్లాడుతూ, జిల్లాలో రెండు విడతలుగా జరుగనున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికార డీఎంకేకు అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల సిబ్బందిని తక్షణం విధుల నుంచి తొలగించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమరవేల్ పాండియన్‌కు విజ్ఞప్తి చేసినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ మూర్తి, సత్తువాచేరి ప్రాంత సెక్రటరీ సుందరం, వకీలు విభాగం దాస్, మాజీ జిల్లా సెక్రటరీ నారాయణన్ తదితరులున్నారు.