‘ఒక యోగి ఆత్మకథ’.. ఉచిత e బుక్ పొందండిలా!
ABN , First Publish Date - 2021-06-14T22:45:24+05:30 IST
ఒక యోగి ఆత్మకథ.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక రచనల్లో ఒకటి. పరమహంస యోగానంద జీవితంలో జరిగిన ఘటనల సమాహారమే ఇది.
రాంచీ: ఒక యోగి ఆత్మకథ.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక రచనల్లో ఒకటి. పరమహంస యోగానంద జీవితంలో జరిగిన ఘటనల సమాహారమే ఇది. ఒక యోగి తన గురించి తాను రాసిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, టీమిండియా కెప్టెన్ కోహ్లీతో పాటు ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచింది. ఈ ఆత్మకథలో మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయ్‌జీ, యుక్తేశ్వర్‌జీ వంటి పరమ గురువుల గురించి విపులంగా రాశారు. అన్నిటినీ మించి సనాతన కాలం నుంచి భారతీయ ఆధ్యాత్మిక వరంగా వస్తోన్న క్రియా యోగం గురించి సవివరంగా తెలిపారు. ఈ పుస్తకాన్ని భక్తుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. పరమహంస యోగానంద చేతుల మీదుగా 1917లో ఈ సొసైటీని స్థాపించారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే అలౌకిక ఆనందాన్ని ... అనుభూతిని అందరికీ పంచిపెట్టడానికి.. యోగానంద జీవన సారాన్ని మరింత చేరువ చేయడానికి ఈ గ్రంథాన్ని ఉచితంగా అందిస్తున్నారు.
‘ఒక యోగి ఆత్మకథ’.. ఉచిత e బుక్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి..