తెలుగు యాత్రికుల కోసం Kasiలో మరో అధునాతన భవనం
ABN , First Publish Date - 2021-11-15T18:45:38+05:30 IST
తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది.
ఢిల్లీ/వారణాసి: తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4:05 గంటలకు కాశీ - పాండే హవేలీలో అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించిన నూతన భవనానికి గృహ ప్రవేశం జరిగింది. కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ కరివెన సత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 34 నూతన గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం 4 చోట్ల కరివెన సత్రం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన, వసతి సౌకర్యం సేవలను అందజేస్తున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 5వ భవనాన్ని అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు.