Croatia Zooలో రెండు సింహాలకు కరోనా

ABN , First Publish Date - 2021-11-25T13:21:43+05:30 IST

క్రొయేషియాలోని జాగ్రెబ్ జంతుప్రదర్శనశాలలో రెండు సింహాలకు కరోనా సోకింది...

Croatia Zooలో రెండు సింహాలకు కరోనా

జాగ్రెబ్:  క్రొయేషియాలోని జాగ్రెబ్ జంతుప్రదర్శనశాలలో రెండు సింహాలకు కరోనా సోకింది.ముందు జూ కీపర్‌‌కు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. జూ కీపర్ నుంచి రెండు సింహాలకు కూడా కరోనా సంక్రమించింది. క్రొయేషియా జూపార్కులో మొట్టమొదటిసారి రెండు సింహాలు కరోనా బారిన పడ్డాయి.జూ కీపర్ తోపాటు లియో, అయానా అనే సింహాల్లో దగ్గు, తుమ్ముల లక్షణాలున్నాయని, కరోనా నుంచి అవి కోలుకుంటున్నాయని జూ హెడ్ డామిర్ స్కోక్ చెప్పారు.కరోనా సోకిన సింహాలను గ్లాస్ ఎన్‌క్లోజరులో ఉంచినందున వీటి నుంచి జూ సందర్శకులకు కరోనా వ్యాపించదని జూ హెడ్ చెప్పారు. జూ కీపర్ కరోనా బారిన పడిన నేపథ్యంలో జూలోని మిగతా జంతువులకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. 4.2 మిలియన్ల జనాభా ఉన్నక్రొయేషియా దేశంలో కరోనాతో 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-11-25T13:21:43+05:30 IST